NIFTY TODAY: నిఫ్టి నిలబడుతుందా?
చైనా మార్కెట్లు కోలుకుంటున్న సమయంలో భారత మార్కెట్లకు పరీక్ష ఎదురు కానుంది. నిన్న మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరిపారు. ఫ్యూచర్స్‌లో కొద్దిగా అమ్మకాలు చేయగా, ఆప్షన్స్‌లో భారీ కొనుగోళ్ళు చేశారు. నిఫ్టి ప్రస్తుతం స్థాయి నుంచి ఎంత వరకు కోలుకుంటుందనే చర్చ మార్కెట్లో నడుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్ల మద్దతు లేకుండా నిఫ్టి ఎంత వరకు నిలబడుతుందనేది చూడాలి. నిఫ్టికి ఇవాళ మొదట్టి మొదటి ప్రతిఘటన 18,248 వద్ద రెండో ప్రతిఘటన 18,286 వద్ద ఎదురవుతుందని అనలిస్ట్ వీరేంద్ర కుమార్ అంటున్నారు.