NIFTY TODAY: నిఫ్టి నిలదొక్కుకునేనా?
అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నా జోరు తగ్గింది. నామ మాత్రపు లాభాల నుంచి ఒక మోస్తరు లాభాలతో వాల్‌స్ట్రీట్ ముగిసింది. ఆసియా మార్కెట్లలో చైనా, హాంగ్‌కాంగ్ మినహాయిస్తే మిగిలిన మార్కెట్లలో స్పీడు తగ్గింది. సింగపూర్ నిఫ్టి వాస్తవానికి రెడ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి దాదాపు వంద పాయింట్ల లాభంతో ఉంది. ఇక నిఫ్టి ఇవాళ ట్రేడింగ్ విషయానికొస్తే… నిఫ్టి క్రితం ముగింపు 17,469. SGX నిఫ్టి స్థాయి అంటే ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17,550 దాటాలి. టెక్నికల్‌గా నిన్నటి దాకా ఉన్న BUY సిగ్నల్స్ ఇవాళ మాయమయ్యాయి. ఇపుడు నిఫ్టి సెల్ జోన్లోకి వచ్చింది. దిగువస్థాయిలో కొనుగోలుకు సంకేతాలు ఉన్నా నిఫ్టి గనుక 17550 దాటితే 17580 వరకు వెయిట్ చేయండి. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 17600 స్టాప్‌లాస్‌తో అమ్ముచ్చు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కాబట్టి నిఫ్టి ఒత్తిడి రావొచ్చు. 17620 దాటితే నిఫ్టిని అమ్మొద్దు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టరు 17550-17570 ప్రాంతంలోనే అమ్మొచ్చు. నిఫ్టి తొలుత క్రితం ముగింపు స్థాయికి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టికి ఇవాళ్టికి కీలక స్థాయి 17377. దీని పైన ఉన్నంత వరకు ఢోకా లేదు. ఎగువ స్థాయిలో అమ్మిన వారు క్రితం ముగింపు లేదా దిగువన బయటపడండి. ఎందుకంటే నిఫ్టికి 17360-380 మధ్య మద్దతు ఉంది. ఇవాళ మాత్రం నిఫ్టిని ఎలాంటి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయొద్దు.