NIFTY TODAY: ఓపెనింగ్‌లో కొనొచ్చా?
అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా…మన మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిన్న యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నా… మన మార్కెట్ 1.65 శాతం నష్టంతో ముగిసింది. గత కొన్ని రోజుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. రేపు ఆర్‌బీఐ ప్రకటించే పరపతి విధానంలో ప్రధాన మార్పులు ఉండవని విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. మరి ఇవాళ కూడా అమ్మకాలు చేస్తారా? లేదా షార్ట్ కవరింగ్‌కు పాల్పడుతారా? సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 16912. ఈ లెక్కన నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17,000 స్థాయిని దాటుతుంది. మరి ఇదే స్థాయిలో ఇన్వెస్టర్లు ఎంటర్ కావొచ్చా అన్న సంశయం ఉంది. లేదా కొద్దిసేపు వెయిట్ చేయడం మంచిదా? ఆ అవకాశం నిఫ్టి ఇస్తుందా? నిఫ్టి గనుక తగ్గితే కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉంది. ఒకవేళ నిఫ్టి 17010 స్థాయిని దాటే పక్షంలో 17,091 దాకా వెళ్ళే ఉంది. సో.. ఓపెనింగ్‌లో కొనేవారికి కూడా కొంత లాభం రావొచ్చు. యూరో మార్కెట్లు ఇవాళ కూడా లాభాల్లో మొదలయ్యే పక్షంలో నిఫ్టి 17,157ను కూడా దాటవచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్ అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ నిఫ్టి పడే పక్షంలో 17,838 వద్ద మద్దతు లభించవచ్చు. దాని తరవాత మద్దతు స్థాయి 17,771. కాని పరిస్థితి చూస్తుంటే నిఫ్టి ఈ స్థాయికి రాకపోవచ్చు.
https://www.youtube.com/watch?v=Jpib3Kuuk5Q