NIFTY BANK: ఆ స్థాయి దాటితేనే…
బ్యాంక్ నిఫ్టి ఇవాళ చాలా కీలక ప్రతిఘటనను ఎదుర్కోనుంది. నిన్న దిగువ స్థాయి నుంచి భారీగా రికవరైన బ్యాంక్ నిఫ్టి ఇవాళ 36555 (50 DEMA) లేదా 36740 (100 DEMA)దాటితేనే లాంగ్ పొజిషన్ తీసుకోవాలని వీరేందర్ సలహా ఇస్తున్నారు. ఈ స్థాయికి దిగువన ఉంటే పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈ రెండు స్థాయిలను దాటితే నిఫ్టి బ్యాంక్‌లో మంచి ర్యాలీకి ఛాన్స్ ఉందని అన్నారు. 36913 లేదా 37140ని కూడా తాకవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే తొలి రెండు ప్రతిఘటన స్థాయిలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనించాలని వీరేందర్ సలహా ఇస్తున్నారు. 35500 ప్రాంతంలో పుట్ రైటింగ్ జరుగుతోందని అన్నారు.