For Money

Business News

కోవాగ్జిన్‌ను సస్పెండ్‌ చేసిన WHO

హైదరాబాద్‌లో భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ తయారీ యూనిట్‌లో లొసులు ఉన్నాయంటూ కోవాగ్జిన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ” ఐక్యారాజ్య సమితి ద్వారా సేకరించే వాక్సిన్‌ల నుంచి భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు మేము ధృవీకరిస్తున్నాం. ఇప్పటికే తమ సంస్థ ద్వారా ఈ వ్యాక్సిన్‌ను పొందిన దేశాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామ”ని WHO పేర్కొంది. కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇచ్చిన తరవాత WHOకు చెందిన అధికారులు మార్చి 14 నుంచి 22వ తేదీ మధ్య కాలంలో కోవాగ్జిన్‌ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గుడ్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌ (GMP)లో లొసుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇక్కడ తయారైన కోవాగ్జిన్‌ ఎగుమతుల సరఫరా ఆగిపోనుంది. దీనిపై భారత్‌ బయోటెక్‌ స్పందిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ GMPకి సంబంధించి పేర్కొన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా ఎగుమతులకు ఉద్దేశించిన కోవాగ్జిన్‌ ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు పేర్కొంది. అయితే కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ సురక్షితమని, సామర్థ్యంలో కూడా ఎలాంటి అనుమానం లేదని WHO పేర్కొంది.