ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉంది
నిఫ్టిలో పుల్ బ్యాక్ వస్తే చాలా గట్టి పుల్ బ్యాక్ వస్తుందని డేటా అనలిస్ట్ వీరేందర్‌కుమార్ అంటున్నారు. నిఫ్టి ఇప్పటికే చాలా ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉందని అంటున్నారు. రేపు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున నిఫ్టి కోలుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిఫ్టి గనుక నిన్న క్రితం స్థాయి 16824 దిగువకు వెళితే మాత్రం 16660 ప్రాంతానికి చేరొచ్చని అంటున్నారు. నిఫ్టి పెరిగితే తొలి అవరోధం 17102 లేదా 17152 వద్ద ఎదురవుతుందని వీరేందర్ కుమార్ అంచనా. ర్యాలీ గట్టిగా ఉంటే 17226 లేదా 17266ని దాటే అవకాశముందని అంటున్నారు. ఇతర వివరాలకు వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=03Zujjk-51I