ఏడాది కనిష్ఠానికి డాలర్
రేపటి నుంచి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం ప్రారంభం కానుంది. ఎల్లుండి వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. పావు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించడం ఖాయమని మార్కెట్ భావిస్తోంది. అదే జరిగితే మార్కెట్‌లో లాభాల స్వీకరణ రావొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ అంశాన్ని మార్కెట్ డిస్కౌంట్ చేసింది. ఫెడ్ గనుకు అర శాతం మేర వడ్డీని తగ్గిస్తే… మార్కెట్‌లో మరో బుల్ ర్యాలీకి ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ ఇవాళ మిశ్రమంగా ట్రేడవుతోంది. డాలర్ ఏడాది కనిష్ఠానికి క్షీణించింది. డాలర్ ఇండెక్స్ ఇపుడు 100.50 దిగువన ట్రేడవుతోంది. డౌజోన్స్ స్వల్ప లాభాల్లో ఉన్నా.. ఐటీ, టెక్ కంపెనీలను నాస్‌డాక్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా యాపిల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఐఫోన్ 16కు ఆశించిన స్థాయిలో ఆర్డర్లు రావడం లేదన్న వార్తలతో ఆ కంపెనీ షేర్‌పై ఒత్తిడి వస్తోంది. దీనికి కూడా టెస్లా, అమెజాన్ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాస్‌డాక్ 0.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది.