For Money

Business News

నిలకడగా వాల్‌స్ట్రీట్‌

మరికొన్ని గంటల్లో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించనుంది. అయితే పావు శాతమా, అర శాతమా? అన్న సస్పెన్స్‌ మార్కెట్‌లో కొనసాగుతోంది. దీంతో స్వల్ప లాభాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌ ఇపుడు స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. దాదాపు నాలుగేళ్ళ తరవాత ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించనుంది. పైగా మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఫెడ్‌ నిర్ణయం చాలా కీలకంగా మారనుంది. అందుకే చాలా మంది ఇన్వెస్టర్లు అర శాతం వడ్డీ తగ్గింపు ఉంటుందనే ఆశతో ఉన్నారు. డాలర్‌, క్రూడ్‌, బులియన్‌ మార్కెట్‌ అన్నీ స్థిరంగా సాగుతున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ఐటీ, టెక్‌ షేర్లలో స్వల్ప ఒత్తిడి కన్పిస్తోంది. భారత మార్కెట్‌లో ఐటీ షేర్ల సూచీ మూడు శాతం క్షీణించిన విషయం తెలిసిందే. ఇవాళ్టి ఫెడ్‌ నిర్ణయం సానుకూలంగా ఉంటే బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లకు మంచి డిమాండ్‌ ఉండే అవకాశముంది.