ఫ్లాట్‌గా వాల్‌స్ట్రీట్

అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే పెద్ద వార్తలు ఏవీ లేదు. ఇవాళ ట్రంప్, జెలెన్‌స్కీ భేటీ ఉంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తరవాత మార్కెట్ రియాక్ట్ అవ్వొచ్చు. ప్రస్తుతానికి ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ స్వల్పంగా గ్రీన్‌లో ఉంది. క్రూడ్ ధరల్లో కూడా పెద్ద మార్పు లేదు. బ్రెంట్ క్రూడ్ 66 డాలర్ల పైన ట్రేడవుతోంది. మెటల్స్‌లో మార్పు కూడా అంతంత మాత్రమే.