For Money

Business News

కుప్పకూలిన వాల్‌స్ట్రీట్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో వాల్‌స్ట్రీట్‌ కుప్పకూలింది. తాను తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఈ ఏడాది అమెరికాలో కొన్ని నెలలు మాంద్యం రావొచ్చని ట్రంప్‌ ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. ట్రంప్‌ నిర్ణయాల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దీనివల్ల కొన్ని నెలల పాటు మాంద్యం రావొచ్చని ఆర్థికవేత్తలు ఇటీవల హెచ్చరిస్తూ వచ్చారు. ఇదే విషయాన్ని ఇవాళ ట్రంప్‌ వెల్లడించారు. దీంతో అన్ని మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఐటీ, టెక్‌ కంపెనీల ఇండెక్స్‌ నాస్‌డాక్‌ భారీగా నష్టపోయింది. ఏకంగా మూడు శాతంపైగా నష్టపోయింది. టెస్లా 8 శాతం, యాపిల్‌, మెటా షేర్లు అయిదు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఎన్‌విడియా వంటి షేర్లు రెండు నుంచి మూడు శాతం చొప్పున నష్టంతో ఉన్నాయి. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా రెండు శాతంపైగా క్షీణించింది. డౌజోన్స్‌ నష్టాలు ఒక శాతంపైనే. ట్రంప్‌ ప్రకటనకు డాలర్‌ కూడా డీలా పడింది. క్రితం ముగింపు వద్దే కదలాడుతోంది. మరోవైపు బులియన్‌ మార్కెట్‌తో పాటు క్రూడ్‌ ఆయిల్‌ మార్కెట్‌ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చాలా వరకు కమాడిటీస్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.