For Money

Business News

కుప్పకూలిన వాల్‌స్ట్రీట్‌

నాన్‌ ఫార్మ్‌ పే రోల్‌ డేటా చాలా నిరాశాజనకంగా రావడంతో వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఐటీ, టెక్‌ షేర్లలో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. దీంతో నాస్‌డాక్‌ సూచీ మూడు శాతం క్షీణించింది. నిన్న కూడా ఈ సూచీ రెండు శాతంపైగా నష్టపోయింది. ఇవాళ నాస్‌డాక్‌తో పాటు ఎస్‌ అండ్‌ పీ 500, డౌజోన్స్‌ సూచీలు కూడా రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. గత నెలలో నాన్‌ ఫార్మ్‌ పే రోల్స్‌ 1.76 లక్షలు ఉంటాయని అంచాన వేయగా… కేవలం 1.14 లక్షలు మాత్రమే నమోదు కావడంతో స్టాక్‌ మార్కెట్లు నివ్వెర పోయాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారు కుంటోందన్న వార్తలు బలపడ్డాయి. దీంతో ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌ స్పీడ్‌పై అనుమానాలు ఉన్న్ ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను తెగనమ్మారు. అద్భుత ఫలితాలు ప్రకటించినా యాపిల్‌ షేర్‌ లాభం కూడా రెండు శాతానికి పరిమితమైంది. ఏఎండీ షేర్‌ మినహా చాలా వరకు బ్లూచిప్‌ ఐటీ, టెక్‌ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక ఇంటెల్‌ షేర్‌ ఏకంగా 25 శాతం క్షీణించడం విశేషం.