నష్టాలతో ముగింపు
వాల్‌స్ట్రీట్ నిన్న లాభాలతో ఆరంభమైనా.. నష్టాలతో ముగిసింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరించడమే దీనికి ప్రధాన కారణం. 2024లో వాల్‌స్ట్రీట్‌లోని మూడు ప్రధాన సూచీలు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా నాస్‌డాక్ 30 శాతం లాభపడింది. ఈ నేపథ్యంలో సంవత్సరాంతాన ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించినట్లు భావిస్తున్నారు. రాత్రి డౌజోన్స్ దాదాపు క్రితం ముగింపు వద్దే ముగిసింది. అయితే నాస్‌డాక్ 0.88 శాతం లాభంతో క్లోజైంది. రాత్రి డాలర్ మరింత బలపడి108.29 వద్ద ముగిసింది. బంగారం కూడా స్థిరంగా ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 74.42 వద్ద ట్రేడవుతోంది.
