For Money

Business News

వాల్‌స్ట్రీట్‌కు మరో పరీక్ష

స్టాక్‌ మార్కెట్లను ఒపెక్‌ నివేదిక నిరాశపర్చింది. ప్రపంచ వృద్ధిరేటుపై ఇప్పటికే నెగిటివ్‌ వార్తలు ఉన్నాయి. చాలా దేశాల్లో వృద్ధిరేటు మందగించింది. ఈ సంవత్సరం కూడా వృద్ధిరేటు పెద్దగా ఉండదని, ముడి చమురుకు పెద్దగా డిమాండ్ పెరగదని ఒపెక్‌ ఇవాళ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నందున ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేదు. దీంతో క్రూడ్‌కు డిమాండ్‌ పెరగదని ఒపెక్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ ఇవాళ నష్టాలతో ప్రారంభమైంది. ఐటీ, టెక్‌ షేర్లు నిలదొక్కుకుంటున్నా… ఎకానమీ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. డౌజోన్స్‌ 0.7 శాతంపైగా నష్టంతో ఉంది. నాస్‌డాక్‌ మాత్రం 0.37 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఐఫోన్‌ 16 విడుదల ఉత్సాహం ఆ కంపెనీ షేర్లలో కన్పించలేదు. యాపిల్ షేర్‌ 2 శాతం దాకా నష్టంతో ట్రేడవుతోంది. క్రూడ్‌ ఆయిల్‌ ఇవాళ నాలుగు శాతం దాకా క్షీణించింది. ఆసియా దేశాలు కొనే బ్రెంట్‌ క్రూడ్‌ ధర 69 డాలర్ల దిగువకు వచ్చింది. 2021 తరవాత క్రూడ్‌ ధరలు ఈ స్థాయికి రావడం ఇదే మొదటిసారి.