For Money

Business News

మిశ్రమంగా వాల్‌స్ట్రీట్‌

అమెరికా మార్కెట్లను ద్రవ్యోల్బణ భయం వెంటాడుతోంది. ఇవాళ వెల్లడైన కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ ధరల పెరుగుదలను సూచించింది. ఆశ్చర్యకరంగా డాలర్‌ ఇవాళ కాస్త బలహీనపడింది. 0.33 శాతంతో డాలర్‌ ఇండెక్స్‌ 94.20 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వాల్‌స్ట్రీట్‌లో నాస్‌డాక్‌ చాలా రోజుల తరవాత 0.4 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ రెడ్‌లో ఉన్నా స్థిరంగా ఉంది.ఇక డౌ జోన్స్‌ సూచీ 0.36 శాతం నష్టంతో ఉంది. చిప్‌ల కొరత కారణంగా ఐఫోన్‌ 13 మోడల్‌ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు యాపిల్‌ ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్‌ క్షీణించింది.