నష్టాల్లోకి జారుకున్న వాల్‌స్ట్రీట్
ఆరంభంలో గ్రీన్‌లో ఉన్న వాల్‌స్ట్రీట్ తరవాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని మార్కెట్లు ఇవాళ డల్‌గా ఉన్నాయి. వాల్‌స్ట్రీట్‌లో నాస్డాక్ మళ్ళీ అరశాతంపైగా నష్టంతో ఉంది. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.3 శాతం నష్టంలో ఉండగా, డౌజోన్స్ నామమాత్రపు నష్టాలతో ఉంది. యయూరో మార్కెట్లు ముఖ్యంగా ప్రధాన మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. యూరో స్టాక్స్ 50 సూచీ 0.83 శాతం లాభంతో ఉంది. మరోవైపు కరెన్సీ మార్కెట్లో డాలర్ స్థిరంగా ఉండగా, క్రూడ్ ఆయిల్ నష్టాల్లో ఉంది. బ్రెంట్ క్రూడ్ 0.62 శాతం నష్టపోగా,WTI మాత్రం ఒకశాతంపైగా నష్టంతో ఉంది. ఇక బులియన్ మార్కెట్ గ్రీన్‌లో ఉన్నా… బంగారంలో పెద్ద మార్పు లేదు. కాని వెండి మాత్రం 2 శాతం లాభంతో ఉంది.