స్థిరంగా వాల్‌స్ట్రీట్
కొద్ది సేపటికే వాల్‌స్ట్రీట్ ఆరంభ లాభాలన్నీ కరిగి పోయాయి. అన్ని సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ద్రవ్యోల్బణ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నా… మార్కెట్ లాభాలను నిలబెట్టుకోలేదు. కాని రెండు గంటల తరవాత మళ్ళీ లాభాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా కరెన్సీ మార్కెట్లో డాలర్ క్షీణించడం ఈక్విటీ మార్కెట్‌కు కలిసివస్తోంది. అలాగే పదేళ్ళ బాండ్ ఈల్డ్స్ కూడా బాగా తగ్గాయి. డాలర్ ఇండెక్స్ 96 దిగువకు వస్తుందేమో చూడాలి. ఇక క్రూడ్‌లో లాభాలు కొనసాగుతున్నాయి. ఈ వారం కూడా క్రూడ్ గ్రీన్‌లో ముగిసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గత ఏడు వారాల్లో అయిదు వారాలు క్రూడ్ లాభాల్లో ముగిసింది. బులియన్ కూడా గ్రీన్‌లో ఉన్నా.. లాభాలు నామ మాత్రమే.