For Money

Business News

నష్టాల్లో వాల్‌స్ట్రీట్‌

పేరోల్స్ డేటా నిరాశాజనకంగా ఉండటంతో వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లోకి జారుకుంది. ఫిబ్రవరిలో 1.51 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయి. పైగా ట్రంప్‌ సుంకాల పాలసీలో సందిగ్ధత కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. నాస్‌డాక్ 0.90 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతోంది. డౌజోన్స్‌ మాత్రం నామమాత్రపు నష్టాల్లో ఉంది. మరోవైపు అమెరికాలో మరో మూడు నెలల్లో మాంద్యం ఏర్పడుతుందనే వార్తలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. డాలర్‌ ఇండెక్స్ 104 లోపు ట్రేడవుతోంది. డాలర్‌ బలహీనంగా ఉండటంతో క్రూడ్‌ ధరలు గ్రీన్‌లో ఉన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 70 డాలర్లను దాటింది. బులియన్‌ మాత్రం డల్‌గా ఉంది. వెండి, బంగారం ధరలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.