వెలుగులో ఎకానమీ షేర్లు

పలు కంపెనీల ఫలితాలు వస్తున్నాయి. చాలా వరకు ఆశాజనకంగా ఉండటంతో డౌజోన్స్ గ్రీన్‌లో ట్రేడవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు బాగా రాణిస్తున్నాయి. దీంతో డౌజోన్స్ 0.7 శాతం లాభంతో ఉండగా, నాస్‌డాక్ మాత్రం నామమాత్రపు లాభంతో ఉంది. ఈ సూచీ 0.13 శాతం లాభంతో ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ స్వల్ప లాభాలతో ఉంది. దీంతో క్రూడ్, బులియన్ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ స్వల్ప నష్టంతో ఉండగా, బంగారం కూడా నామమాత్రపు నష్టాల్లో ట్రేడవుతోంది.