For Money

Business News

నష్టాలతో ప్రారంభం

వాల్‌స్ట్రీట్‌ ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభమైంది. ప్రధాన సూచీల్లో నాస్‌డాక్‌ అర శాతంపైగా నష్టపోగా, డౌజోన్స్‌ మాత్రం నామ మాత్రపు నష్టం అంటే 0.03 శాతం నష్టంతో ట్రేడవుతోంది. మరోవైపు యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. అయితే మెజారిటీ మార్కెట్లు భారీ నష్టాలతో ఉన్నాయి. ప్రధాన మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఉన్నా.. యూరో స్టాక్స్‌ సూచీ 0.8 శాతం నష్టంతో ఉది. ఇక చైనా డేటా చాలా వీక్‌గా ఉండటంతో క్రూడ్‌ ఆయిల్‌పై ఒత్తిడి కొనసాగుతోంది. బులియన్‌ గ్రీన్‌లో ఉన్నా.. అధిక స్థాయిలో ఒత్తిడి కన్పిస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ మళ్ళీ కోలుకుని 101పైన ట్రేడవుతోంది.