For Money

Business News

178200పైన ముగిసిన నిఫ్టి

ఓపెనింగ్‌లోనే ఒక మోస్తరు నష్టాలు పొందిన నిప్టి.. క్రమంగా దిగువ స్థాయి నుంచి కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల సానకూలతలకు మార్కెట్‌ ఏమాత్రం స్పందించలేదు. రాత్రి అమెరికా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ముగిసినా…దాని ప్రభావం మన మార్కెట్లపై కన్పించలేదు. ఆరంభంలోనే 18060 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నిఫ్టి.. ఆ తరవాత క్రమంగా కోలుకుంటూ వచ్చింది. మిడ్‌ సెషన్‌లో కాస్త ఒత్తిడి వచ్చినా.. 2 గంటల తరవాత కోలుకుంది. వారాంతం కావడంతో చాలా మంది ఇన్వెస్టర్లు చివర్లో పొజిషన్స్‌ తీసుకున్నారు. దీంతో నిఫ్టి క్లోజింగ్‌ సమంయలో 18218 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 73 పాయింట్ల లాభంతో 18203 వద్ద ముగిసింది. ఎస్‌బీఐ ఆకర్షణీయ ఫలితాలతో బ్యాంకు షేర్లు ఒక మోస్తరు లాభాలు పొందాయి. అదానీ గ్రూప్‌ షేర్లు కూడా మూడు శాతంపైగా లాభంతో ముగియడం విశేషం. దాదాపు అన్ని షేర్లు అయిదు శాతంపైగా లాభంతో ముగిశాయి.