For Money

Business News

నిస్తేజంగా వాల్‌స్ట్రీట్‌

పలు కార్పొరేట్‌ ఫలితాలు డల్‌గా ఉండటం, డాలర్‌ పెరగడంతో వాల్‌స్ట్రీట్‌ గ్రీన్‌లో ఉన్నా… లాభాలు నామమాత్రంగా ఉన్నాయి. నాస్‌డాక్‌ ఒక్కటే 0.25 శాతం లాభంలో ఉంది. మిగిలిన సూచీల లాభాలు అంతంత మాత్రమే. కాకపోతే అంతకుముందు ముగిసిన యూరప్‌ మార్కెట్లు మాత్రం గట్టి లాభాలతో ముగిశాయి. ఇక కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ స్వల్పంగా పెరిగింది. డాలర్‌ పెరిగినా క్రూడ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు 90 డాలర్లకు వెళుతుందని వార్తలు వస్తుండగా… అనలిస్టులు మాత్రం క్రూడ్‌ వంద డాలర్లకు చేరడం ఖాయంగా కన్పిస్తోంది. సరఫరా పెంచడానికి ఒపెక్‌ ఏమాత్రం సుముఖంగా లేదు. ఇక బులియన్‌లో బంగారం స్థిరంగా ఉండగా, వెండి రెండు శాతందాకా క్షీణించింది.