For Money

Business News

బలహీనంగా నాస్‌డాక్‌

ఎన్‌విడా కంపెనీ షేర్‌ ఇవాళ దాదాపు నాలుగు శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిన్న కంపెనీ ప్రకటించిన కంపెనీ అమ్మకాలు, లాభం అద్భుతంగా ఉన్నా… గైడెన్స్‌ పట్ల ఇన్వెస్టర్లలో అనుమానాలు ఉన్నాయి. కంపెనీ నికర లాభం, అమ్మకాలు దాదాపు 80 శాతంపైగా పెరిగాయి. అయినా ఈ షేర్‌ నష్టాల్లో ఉంది. ఇతర ఐటీ షేర్లలో నష్టాలు ఒక మోస్తరుగా ఉండటంతో నాస్‌డాక్‌ ఇపుడు 0.32 శాతం నష్టంతో ఉంది. ఓపెనింగ్‌ నష్టాలు సగం దాకా రికవర్‌ అయ్యాయి. ట్రెండ్‌ చూస్తుంటే నాస్‌డాక్‌ కూడా లాభాల్లోకి వచ్చేలా ఉంది. మరోవైపు డౌజోన్స్‌ 0.9 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.23 శాతం లాభంతో ఉన్నాయి. డాలర్‌ గ్రీన్‌లో ఉండగా, క్రూడ్‌, గోల్డ్‌ నష్టాల్లో ఉన్నాయి.