For Money

Business News

స్వల్ప నష్టాల్లో…

అమెరికా మార్కెట్లు పశ్చిమాసియా యుద్ధాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. స్థానిక అంశాలకే రియాక్ట్‌ అవుతోంది. ఇవాళ వాల్‌స్ట్రీట్‌ స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్‌ ధరలు భారీగా పెరిగినా.. మార్కెట్‌పై పెద్దగా ప్రభావం లేదు. అలాగే డాలర్‌ కూడా నిలకడగా ఉండటం మరో అనుకూల అంశం. అయితే పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ 4ను దాటడం మార్కెట్‌ను ఆందోళన కల్గిస్తోంది. ఫ్యూచర్స్‌తో పోలస్తే స్వల్ప లాభాలతో వాల్‌స్ట్రీట్‌ ప్రారంభమైంది. ఉదయం నుంచి 200 పాయింట్లకు పైగా నష్టంతో డౌజోన్స్ ఫ్యూచర్‌ ఉండగా.. ఇపుడు వంద పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అలాగే నాస్‌డాక్‌ కూడా 0.37 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.24 శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఈ వారంలో ఫెడరల్‌ రిజర్వ్‌కు చెందిన అధికారులు ప్రసంగాలు ఉన్నాయి. నాన్‌ ఫామ్‌ ఉద్యోగాలు ఆశించిన స్థాయికన్నా అధికంగా ఏర్పడటంతో రానున్న సమావేశంలో ఫెడరల్‌ రిజర్వ్‌ భారీగా వడ్డీ కోత విధించకపోవచ్చని మార్కెట్‌ భావిస్తోంది. మరోవైపు ప్రధాన బ్యాంకుల ఫలితాలు కూడా ఈవారం రానున్నాయి. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ స్వల్ప నష్టాలతో లేదా నిలకడగా ఉండే అవకాశాలే అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.