For Money

Business News

ఆరంభ లాభాలు ఆవిరి

వాల్‌స్ట్రీట్‌ ఆరంభ లాభాలు కరిగిపోయాయి. ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను తాజా సుంకాల నుంచి అమెరికా మినహాయిస్తున్నట్లు వచ్చిన వార్తలతో వాల్‌స్ట్రీట్‌ లాభాలతో ప్రారంభమైంది. కీలక సూచీలు ఒక శాతంపైగా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ లాభాలు ఎంతో సేపు నిలబడలేదు. డౌజోన్స్‌ ఇపుడు 0.2 శాతం. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.36 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్‌ లాభాల నుంచి రెడ్‌లోకి జారుకుంది. మరోవైపు కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ మరింత బలహీనపడింది. డాలర్‌ ఇండెక్స్‌ మరో అరశాతం తగ్గి 99.44కి పడిపోయింది. క్రూడ్‌, బులియన్‌ రెడ్‌లో ఉన్నా… నష్టాలు అంతంత మాత్రమే ఉన్నాయి.