నష్టాల్లో వాల్‌స్ట్రీట్
సెప్టెంబర్‌లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పావెల్ చెప్పినా… వాల్‌స్ట్రీట్ నష్టాల్లోకి జారుకుంది. బహుశా పావెల స్పీచ్‌ను మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసినట్లు ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై మార్కెట్‌లో ఇంకా అనుమానాలు ఉన్నట్లు విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మూడు ప్రధాన సూచీలు ఒక శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు మెటా చక్కటి ఫలితాలను ప్రకటించింది. పాజిటివ్ గైడెన్స్ ఇవ్వడంతో షేర్ దాదాపు 7 శాతంపైగా లాభంతో ఉంది. ఏఎండీ, టెస్లా, ఎన్‌విడా షేర్లు మూడు శాతం నష్టంతో ఉన్నాయి.