నాస్‌డాక్: తప్పని నష్టాల కష్టాలు
ఆరంభంలో కాస్త గ్రీన్‌లోఉన్న డౌజోన్స్ కూడా నష్టాల్లోకి వచ్చేసింది. కంపెనీల ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉండటం… చైనా వడ్డీ రేట్ల ప్రభావం వాల్‌స్ట్రీట్‌పై పెద్దగా లేదు. డౌజోన్స్ ఒక శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.35 శాతం నష్టపోయింది. కాని నాస్‌డాక్ సూచీ ఏకంగా రెండు శాతం నష్టపోయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విమాన ఉద్యోగిని లైంగికంగా వేధించడాన్న ఆరోపణలు రావడంతో ఆ కంపెనీ షేర్ 8 శాతం క్షీణించింది. అయితే ఈ ఆరోపణలను ఎలాన్ మస్క్ ఖండించారు. మరోవైపు పదేళ్ళ అమెరికా బాండ్ ఈల్డ్స్ మూడు శాతం క్షీణించగా… డాలర్ ఇండెక్స్ మళ్ళీ కోలుకుని 103పైకి చేరింది. ఇక క్రూడ్ ధరలు నిలకడగా ఉన్నాయి. అలాగే బులియన్ ధరలు కూడా.