ఆయిల్ దెబ్బకు నష్టాల్లో వాల్‌స్ట్రీట్
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మళ్ళీ 122 డాలర్లకు చేరింది. అమెరికా వారాంతపు క్రూడ్ నిల్వలు విశ్లేషకుల అంచనాలకు మించి తగ్గడంతో ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో వాల్‌స్ట్రీట్ నష్టాలబాట పట్టింది. తమ పనితీరుపై ఆయిల్ ధరల ప్రభావం ఉంటుందని అనేక కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఎనర్జీ షేర్లు పెరిగినా డౌజోన్స్ 0.71 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.35 శాతం నష్టంతో ఉంది. నాస్డాక్ మాత్రం దాదాపు క్రితం స్థాయి వద్దే నిలకడగా ఉంది. డాలర్‌తో పాటు దాదాపు అన్ని రకాల కమాడిటీస్ ధరలు పెరగడంతో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ భయాలు పట్టుకున్నాయి. మరోవైపు స్వల్ప నష్టాలతో ప్రారంభమైన యూరో మార్కెట్లు భారీ నష్టాలతో క్లోజయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. జర్మనీ డాక్స్ 1.41 శాతం నష్టపోయింది. యూరో స్టాక్స్ 50 సూచీ 1.55 శాతం నష్టంతో ఉంది.