నష్టాల్లో వాల్‌స్ట్రీట్
చాలా రోజుల తరవాత వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ట్రేడవుతోంది. మూడు ప్రధాన సూచీలు అర శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. డౌజోన్స్ అర శాతంపైగా నష్టంతో ఉంది. డాలర్ ఇండెక్స్ ఇవాళ స్థిరంగా ఉంది. పెద్ద మార్పుల్లేవ్. కాని వెండి మాత్రం ఒకటిన్నర శాతం క్షీణించింది. బంగారం ధరలో పెద్ద మార్పు లేదు. పైగా గ్రీన్‌లో ఉంది. కాని క్రూడ్ పరుగు ఆగడం లేదు. WTIతో పాటు బ్రెంట్ క్రూడ్ గ్రీన్‌లో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ 84 డాలర్లను దాటే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇవాళ యూరో మార్కెట్లు నష్టాల్లో ముగిసినా… అవి నామ మాత్రమే.