వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లోఉన్నా…
ఉదయం నుంచి అంతర్జాతీయ మార్కెట్లు ఆకర్షణీయ లాభాలు గడించాయి. ముఖ్యంగా యూరో మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. కీలక మార్కెట్ల సూచీలు 1.5 శాతంపైనే లాభపడ్డాయి. మన మార్కెట్ కూడా ఒకశాతం దాకా లాభపడింది. కాని వాల్‌స్ట్రీట్‌లో మాత్రం ఆ ఉత్సాహం లేదు. సూచీలన్నీ అరశాతం దరిదాపుల్లో ట్రేడవుతున్నాయి. బహుశా ఫెడ్ సమావేశం నిర్ణయం వచ్చే వరకు అమెరికా మార్కెట్లో ఇలానే ఉండే అవకాశముంది. మరోవైపు డాలర్ స్థిరంగా ఉన్నా… క్రూడ్, బులియన్ పెరగడం విశేషం.ముఖ్యంగా వెండి రెండు శాతంపైన పెరిగింది.