వాల్‌స్ట్రీట్‌కు ఆంక్షల భయం
రష్యాపై అదనపు ఆంక్షలు ఉంటాయన్న వార్తలతో వాల్ స్ట్రీట్ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. పైగా మార్కెట్‌కు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంది. కరెన్సీ మార్కెట్ డాలర్ దూకుడు జోరుగా ఉంది. ఇవాళ డాలర్ ఇండెక్స్ 99.31కి దాటింది. ఇక వాల్‌స్ట్రీట్‌లో ట్విటర్ దెబ్బకు నిన్న 1.9 శాతం పెరిగిన నాస్‌డాక్ ఇపుడు 1.71 శాతం నష్టంతో ఉంది. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.73 శాతం నష్టంతో ఉంది. డౌజోన్స్ ఒక్కటే 0.25 శాతం నష్టంతో ట్రేడవుతోంది. డాలర్ ఇంత పెరిగినా క్రూడ్ మాత్రం 107 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బులియన్ స్వల్పంగా తగ్గింది.