For Money

Business News

మళ్ళీ భారీ నష్టాల్లో…

గత రెండు సెషన్స్‌లో ఆకర్షణీయ లాభాలు గడించిన వాల్‌స్ట్రీట్‌ ఇవాళ నష్టాల బాట పట్టింది. కెనడా, మెక్సికోలపై విధించిన ఆంక్షల కారణంగా దేశీయంగా ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుందని అమెరికా ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఐటీ, టెక్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు భారీగా క్షీణించాయి. నాస్‌డాక్‌ 1.32 శాతం నష్టంతో ట్రేడవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ 104 దిగువకు పడిపోయింది. ఆర్థిక వృద్ధి రేటుపై అనుమానాల కారణంగా క్రూడ్‌ ధరలు కూడా గత కొన్ని రోజులుగా పడుతూ వస్తున్నాయి. ఇవాళ అమెరికా క్రూడ్‌ ధర 66 డాలర్ల దిగువకు పడిపోయింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర కూడా 69 డాలర్ల దిగువకు క్షీణించింది. ఇక బులియన్‌లో బంగారం ధర దాదాపు క్రితం స్థాయి వద్దే ఉన్నా.. వెండి మాత్రం అరశాతంపైగా లాభంతో ట్రేడవుతోంది.