For Money

Business News

వాల్‌స్ట్రీట్‌ లాభాలకు కారణం…

రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. డౌజోన్స్‌ ఒక శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.43 శాతం, నాస్‌డాస్‌ 1.93 శాతం లాభంతో ముగిశాయి. టెక్‌ షేర్లతో పాటు ఐటీ షేర్లకు కూడా మంచి మద్దతు లభించింది. చాలా రోజుల తరవాత ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో వాల్‌స్ట్రీట్‌ కాస్త ఊపిరిపీల్చుకుంది. నిన్న బ్రెంట్‌ క్రూడ్‌ 123 డాలర్లకు చేరింది. ఇపుడు 119 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నాటో దేశాల సదస్సు ఇవాళ కూడా కొనసాగనుంది. ఆయిల్‌ సరఫరాకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. సరఫరాకు లోటు ఉండకపోవచ్చని నాటో దేశాలు భావిస్తున్నాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ స్వల్పంగా క్షీణించింది. 0.26 శాతం తగ్గి 98.55 వద్ద డాలర్‌ ఇండెక్స్‌ ట్రేడవుతోంది.