అయిదో రోజు భారీ నష్టాలు
వాల్‌స్ట్రీట్‌ను మాంద్యం భయాలు ముంచెత్తుతున్నాయి. వడ్డీ రేట్లతో గత కొన్ని రోజులు ఇబ్బంది పడిన మార్కెట్లో ఇపుడు మాంద్యం వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గడంతో … ఎనర్జీ షేర్లు భారీగా తగ్గాయి. కేవలం ఈవారంలో బ్రెంట్ క్రూడ్ ధరలు 103 డాలర్ల నుంచి 93 డాలర్లకు పడిపోయింది. దీనికి మరో ప్రధాన కారణం డాలర్ బలపడటం. డౌజోన్స్ 0.45 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ ఒక శాతం, నాస్డాక్ రెండు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. నాస్డాక్ గత మూడు సెషన్స్‌లో ఆరు శాతంపైగా క్షీణించింది. డాలర్ ఇండెక్స్ ఇవాళ ఒక శాతంపైగా పెరిగింది. దీంతో డాలర్ ఇండెక్స్ 110కు దగ్గరవుతోంది. బ్రెంట్ క్రూడ్‌కు 92.75 డాలర్ల వద్ద మద్దతు లభిస్తుందేమో చూడాలి. సింగపూర్ నిఫ్టి 45 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.