మళ్ళీ వడ్డీ రేట్ల భయం
అమెరికా ఆర్థిక ఇంకా చల్లారినట్లు కన్పించడం లేదు. వస్తున్న ప్రతి డేటా పాజిటివ్‌గా ఉంది. దీంతో ఈసారి కూడా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను అధికంగా పెంచే అవకాశముందన్న వార్తలు అపుడే మొదలయ్యారు. డాలర్ ఇవాళ ఒక శాతం పెరిగింది. పదేళ్ళ బాండ్ ఈల్డ్స్ 3.8 శాతం దాటాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి కన్పిస్తోంది. ఇప్పటికే 32 శాతంపైగా క్షీణించడంతో నాస్డాక్ నామ మాత్రపు నష్టంతో దాదాపు క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.33 శాతం, డౌజోన్స్ 0.45 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పాటు క్రూడ్ కూడా పెరగడం విశేషం. బ్రెంట్ క్రూడ్ మళ్ళీ 94 డాలర్లను దాటింది. బులియన్ మార్కెట్ డల్‌గా ఉంది. ధరల్లో మార్పు లేదు.