నష్టాల్లో వాల్‌స్ట్రీట్
బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడంతో డాలర్ పరుగులు తీస్తోంది. డాలర్ ఇండెక్స్ ఇపుడు 99 దాటింది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి వస్తోంది. మూడు ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ఆరంభంలో స్థిరంగా ఉన్న ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా ఇపుడు అరశాతం నష్టంతో ఉంది. నాస్‌డాక్ నష్టాలు కేవలం 0.33 శాతమే. క్రూడ్ ఆయిల్ బాగా క్షీణించడంతో ఎనర్జీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దీంతో డౌజోన్స్ 0.8శాతం నష్టంతో ట్రేడవుతోంది. డాలర్ పుంజుకోవడంతో క్రూడ్‌తో పాటు మెటల్స్ కూడా తగ్గాయి.