For Money

Business News

భారీ నష్టాల్లో వాల్‌స్ట్రీట్‌

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గేలా కన్పించడం లేదు. తాజా వార్తల ప్రకారం బ్రెంట్‌ క్రూడ్‌ 110 డాలర్లకు చేరువలో ఉంది. ఇదే సమయంలో డాలర్‌ పెరుగుతోంది. దీంతో మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. అయితే ఐటీ, టెక్‌ షేర్లలో భారీ ఒత్తిడి కన్పిస్తోంది. ప్రస్తుతం 1.18 శాతం నష్టంతో నాస్‌డాక్‌ ట్రేడవుతుండగా, డౌజోన్స్‌ నష్టం 0.34 శాతమే. ప్రధాన ఐటీ షేర్లన్నీ ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు అమెరికా బాండ్ ఈల్డ్స్‌ భారీగా పెరుగుతున్నాయి. పదేళ్ళ బాండ్‌ ఈల్డ్‌ మళ్ళీ 4.37 శాతం దాటింది. యుద్దానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఎపుడు ఏ దేశం దేనిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మార్కెట్‌ క్లోజింగ్‌ లోపల పుంజుకుంటుందా లేదా వీకెండ్‌ ఒత్తిడి పెరుగుతుందా అన్నది చూడాలి.

Leave a Reply