కొనసాగుతున్న అమ్మకాలు
వాల్‌స్ట్రీట్‌లో ఉక్రెయిన్ అనిశ్చితి కొనసాగుతోంది. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని స్థితి. రెండు రోజులు సెలవు. ఈ నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఐటీ, టెక్ షేర్లలో భారీ అమ్మకాలు సాగుతున్నాయి. నాస్‌డాక్ 1.27 శాతం నష్టంతో ఉండగా,ఎస్ అండ్ పీ 500 సూచీ 0.80 శాతం నష్టంతో ఉంది. డౌజోన్స్ కూడా 0.54 శాతం నష్టంతో ట్రేడవుతోంది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ భారీగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ 0.35 శాతం లాభంతో 96.13 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో క్రూడ్ 0.9 శాతం పెరిగింది.