For Money

Business News

భారీ నష్టాల్లో ముగిసిన వాల్‌స్ట్రీట్‌

ఉక్రెయిన్‌ వ్యవహారం క్రమంగా స్టాక్‌ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా ఆల్‌టైమ్‌ హైలో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లకు పడటానికి ఏదో ఒక సాకు కోసం ఎదురు చూస్తోంది. ఉక్రెయిన్‌ గొడవ ఇన్వెస్టర్లకు మంచి సాకుగా పనికివస్తోంది. సూచీలు పైకి గ్రీన్‌గా లేదా ఒక మోస్తరు నష్టాల్లో ఉన్నా చాలా కంపెనీల షేర్ల ధరలు 50 శాతం పైగా క్షీణించాయి. రాత్రివాల్‌ స్ట్రీట్‌ గ్రీన్‌లో ప్రారంభమైంది. స్వల్ప నష్టాలతో ట్రేడైంది. చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. నాస్‌డాక్‌ 2.57 శాతం, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 1.84 శాతం, డౌజోన్స్‌ 1.38 శాతం నష్టంతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. నిన్న సెలవు కారణంగా పనిచేయని జపాన్‌ స్టాక్ ఎక్స్ఛేంజీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. న్యూజిల్యాండ్‌, ఆస్ట్రేలియా మార్కెట్లు రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఉండగా, హాంగ్‌సెంగ్‌ 1.65 శాతం నష్టంతో ట్రేడవుతోంది.