స్థిరంగా ముగిసిన వాల్‌స్ట్రీట్
రాత్రి వాల్‌స్ట్రీట్‌లో ప్రధాన సూచీలు నిలకడగా ముగిశాయి. ప్రధాన సూచీల్లో పెద్ద మార్పులు లేవు. డౌజోన్స్ మాత్రం 0.38 శాతం నష్టపోగా, నాస్‌డాక్ గ్రీన్‌లో ముగిసింది. ఇవాళ వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించి ఫెడరల్ రిజర్వ్ కీలక ప్రకటన చేయనుంది. పావు శాతం మేర వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్ జెరోమ్ పావెల్‌కు ఇదే చివరి సమావేశం. దీంతో 2006లోవడ్డీ రేట్లకు సంబంధించి ఫెడ్ చేసే కామెంట్స్ కీలకం కానున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపును వాల్‌స్ట్రీట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసింది. కామెంటరీని బట్టి మార్కెట్ స్పందన ఉంటుంది. ఏడాది చివర్లో ఎలాగూ అమ్మకాలు ఉంటాయి. కాబట్టి… ఫెడ్ నిర్ణయం కీలకం కానుంది.
