ఫెడ్ నిర్ణయం వైపు షేర్ మార్కెట్
వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ట్రేడవుతోంది. ఎక్కువగా ఐటీ, టెక్ షేర్లలోనే ఒత్తిడి కన్పిస్తోంది. ఇవాళ రాత్రికి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుంది. 0.5 శాతమా లేదా 0.75 శాతమా అన్నది తేలనుంది. దీనికి ముందు డాలర్, బాండ్ మార్కెట్ స్థిరంగా ఉంది. ఈక్విటీ మార్కెట్లలో నాస్డాక్ ఒక శాతంపైగా నష్టంతో ఉండగా,ఎస్ అండ్ పీ 500 సూచీ 0.61 శాతం నష్టంతో ఉంది. కాని డౌజోన్స్ కేవలం 0.22 శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనాలో కోవిడ్ ఆంక్షలు సడలిస్తున్నా రనే వార్తలతో క్రూడ్ ఆయిల్ పెరుగుతోంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 96 డాలర్లపైన ట్రేడవుతోంది.