అయ్యో… మళ్ళీ నష్టాల బాట
ప్రపంచ మార్కెట్లలో నిన్న వచ్చిన ర్యాలీ ఒక రోజు ర్యాలీగా మిగిలిపోయింది. మధ్యాహ్నం నుంచి యూరో మార్కెట్లు ఇపుడు అమెరికా మార్కెట్లు మళ్ళీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇవాళ వచ్చిన అమెరికా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా మార్కెట్ అంచనాలకు మించి ఉండటంతో… ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను కచ్చితంగా పెంచుతుందనే టాక్ మొదలైంది. యూఎస్ పదేళ్ళ బాండ్ ఈల్డ్స్ 1.97 శాతాన్ని దాటాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. యూరో మార్కెట్లలో జర్మనీ డాక్స్ 2.92 శాతం క్షీణించగా, యూరో స్టాక్స్ 50 సూచీ మూడు శాతంపైగా క్షీణించింది.దీంతో వాల్స్ట్రీట్లో అత్యధికంగా నాస్డాక్ 2 శాతం నష్టపోగా డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు ఒకటిన్నర శాతం వరకు నష్టపోయాయి.