15,800 కోసం వెయిట్ చేయండి
నిఫ్టి బలహీనంగా ఉందని, త్వరలోనే 16,000 లేదా 15,800 ప్రాంతంలో రావొచ్చని గోల్డ్లాక్స్ రీసెర్చికి చెందిన గౌతమ్ షా అభిప్రాయపడ్డారు. ఈ స్థాయిలో నిఫ్టికి మద్దతు అందవచ్చని అన్నారు. ఇవాళ సీఎన్బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు తొందరపడి ఇపుడు కొనాల్సిన అసవరం లేదని, నిఫ్టి మరింత క్షీణించే అవకాశముందని అన్నారు. 16,000 దిగువన నిఫ్టి నిలదొక్కుకుంటే.. అపుడు వృద్ధికి అవకాశాలు ఉన్న రంగాలను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే మార్కెట్లో బాగా పెరిగిన షేర్లను కాకుండా కొత్త రంగాలను ఎంపిక చేసుకోవాలన్నారు. న్యూఏజ్ ఇండస్ట్రీస్లకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని అన్నారు. అలాగే కోవిడ్ సమయంలో కూలిపోకుండా…ఆ పరిస్థితులను గట్టి ఎదుర్కున్న రంగాలకు భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. మల్టిప్లెక్స్, హోటల్ రంగంలోని మంచి షేర్లు… మున్ముందు బాగా రాణిస్తాయని అన్నారు. నిఫ్టి 15,800 ప్రాంతానికి వచ్చినపుడు పోర్టుఫోలియోను ఇన్వెస్టర్లు బిల్డప్ చేసుకోవచ్చని ఇన్వెస్టర్లకు ఆయన సూచించారు. అలాగే పదేళ్ళ తరవాత రియల్ ఎస్టేట్ రంగం రాణిస్తోందని అన్నారు. ఏడాదిలో రియల్ ఎస్టేట్ సూచీ 70 శాతం పెరిగిందని అన్నారు. మరో ఏడాది వరకు రియల్ ఎస్టేట్రంగం రాణించవచ్చిన గౌతమ్ షా అన్నారు. రియల్ ఎస్టేట్ సూచీకి 400 స్టాప్లాస్తో షేర్లు కొనాలని అన్నారు. ఇపుడు ఈ సూచీ 422 వద్ద ట్రేడవుతోంది.