For Money

Business News

ఈ షేర్‌ రూ.10లోపు పడుతుందా?

వొడాఫోన్‌ ఐడియా షేర్‌లో ఇటీవల భారీగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ప్రతి వార్తకు ఈ షేర్‌ భారీగా స్పందిస్తోంది. పాజిటివ్‌ వార్తలు రాగానే పెరగడం, నెగిటివ్‌ న్యూస్‌కు అదే స్థాయిలో క్షీణించడం ఈ కౌంటర్‌లో పరిపాటిగా మారింది. నిజానికి ఈ షేర్‌ డే ట్రేడర్స్‌కు డార్లింగ్‌ మారింది. తాజా వార్తలు ప్రకారం చూస్తుంటే ఈ షేర్‌ రూ. 10లోపునకు పడుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభలో కూరుకున్న ఈ కంపెనీకి తాజాగా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు విముఖ చూపుతున్నాయని బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో వచ్చిన వార్తకు ఈ షేర్‌ బాగా ప్రతికూలంగా స్పందించింది. కంపెకనీకి భారీగా రుణాలు ఉండటం, వాటాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడంతో పాటు ఖర్చులకు సంబంధించి కూడా కంపెనీ వద్ద ప్లాన్‌ లేకపోవడంతో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జంకుతున్నాయని పత్రిక పేర్కొంది.
వొడాఫోన్‌ ఐడియా షేర్‌ ఇవాళ రెండున్నర శాతం క్షీణించి రూ. 13.19 వద్ద ముగిసింది. ఈ షేర్‌ను అమ్మాలని.. టార్గెట్‌ రూ.2.5గా గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్ ఇటీవల రెకమెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా షేర్‌కు సంబంధించి టెక్నికల్‌గా కనిష్ఠ, గరిష్ఠ వివరాలు ఇవి..
ఈ షేర్‌ ప్రస్తుత విలువ రూ. 13.19
డౌన్‌సైడ్‌ రిస్క్‌ 33 శాతం
మద్దతు స్థాయిలు : రూ. 13.20, రూ. 12.20, రూ. 11.80, రూ. 11.10
ప్రతిఘటన స్థాయిలు: రూ. 14.70, రూ. 15.20, రూ. 15.40
ఈ షేర్‌ ప్రస్తుతం 20 రోజులు, 50రోజులు, వంద రోజుల చలన సగటకు దిగువన ట్రేడవుతున్న విషయాన్ని మర్చిపోవద్దు.

Leave a Reply