ఆ రెండు షేర్లూ జూమ్
కేంద్ర ప్రభుత్వానికి వాటా ఇస్తున్నట్లు ప్రకటించడంతో నిన్న వోడాఫోన్, ఇవాళ టాటా కమ్యూనికేషన్ నష్టపోయాయి. నిన్న ఏకంగా 20 శాతంపైగా వోడాఫోన్ నష్టపోగా, టాటా కమ్యూనికేషన్ ఇవాళ నష్టాలతో ప్రారంభమైంది. అయితే కేంద్రానికి తాము వాటా ఇచ్చిన కంపెనీ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం ఉండదని వోడాఫోన్ ఇచ్చిన ప్రకటనతో రెండు షేర్లూ కోలుకున్నాయి. కంపెనీ బోర్డులో కేంద్రం సీటు తీసుకోదని వోడాఫోన్ పేర్కొంది. కేవలం తాము ఇవ్వాల్సిన వడ్డీకి సరిపడా షేర్లు ఇవ్వడం వినా… కంపెనీ పనితీరులో ఎలాంటి మార్పు ఉండదని వోడాఫోన్ పేర్కొంది. ఈ వివరణతో రెండు కంపెనీల షేర్లు భారీగా కోలుకున్నాయి. వోడాఫోన్ ఇపుడు 12 శాతం దాకా లాభపడి రూ. 13.20 వద్ద ట్రేడవుతోంది.అలాగే టాటా కమ్యూనికేషన్స్ 4 శాతం లాభపడి రూ. 1,563 వద్ద ట్రేడవుతోంది.