ఓపీఓకు VLCC
వీఎల్‌నసీసీ హెల్త్ లిమిటెడ్ క్యాపిటల్ మార్కెట్‌కు రానుంది. ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా రూ.300 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఐపీఓలో భాగంగా ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు 89.2 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద అమ్మనున్నారు. ఐపీఓ నిధులను విస్తరణతో పాటు, రుణాలను చెల్లించేందుకు వినియోగించనున్నారు. బ్రాండ్ డెవలప్మెంట్లో పెట్టుబడికి రూ. 30.80 కోట్లు, డిజిటల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడికి రూ. 40 కోట్లను వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. మార్చి 2021 నాటికి దక్షిణాసియా, ఆగ్నేయాసియా, జీసీసీ ప్రాంతంతో పాటు తూర్పు ఆఫ్రికాలోని పన్నెండు దేశాల్లోని 143 నగరాల్లో ఈ కంపెనీకి 310 ప్రదేశాలలో కస్టమర్లు ఉన్నారు.