For Money

Business News

పన్ను ఎగవేసిన నెట్‌ఫ్లిక్స్‌?

అమెరికాకు చెందిన ప్రముఖ స్ట్రీమింగ్‌ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌పై భారత ప్రభుత్వ దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీసా నిబంధనలు, పన్ను ఎగవేతతో పాటు ఆఫీసులో వర్ణ వివక్ష చూపారన్న ఆరోపణలపై ఈ విచారణ జరుగుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. నెట్‌ప్లిక్స్‌కు భారతలో బిజినెస్‌, లీగర్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌గా పనిచేసిన నందిని మెహతా కూడా ఇదే ఆరోపణలు చేశారు. ఈ అంశాలపై నందిని మెహతాకు భారత ప్రభుత్వం ఈ మెయిల్‌ పంపినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. న్యూయార్క్‌లో హోం శాఖ తరఫున పనిచేసే ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు చెందిన భారత అధికారి దీపక్‌ యాదవ్‌ ఈ వివరాలను వెల్లడించారు.