For Money

Business News

నేటి నుంచి విజయ డయాగ్నోస్టిక్‌ IPO

విజయ డయాగ్నోస్టిక్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభమౌతోంది. 3వ తేదీన ముగుస్తుంది. ఒక్కో షేర్‌ ధర శ్రేణిని రూ.522-531గా నిర్ణయించారు. కనీసం 28 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేయాలి. గరిష్ఠంగా 13 లాట్లకు (364 షేర్లు) దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ నెల 14న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో కంపెనీ షేర్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా విజయా డయాగ్నోస్టిక్‌ రూ.1,895 కోట్లు సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా 29 మంది యాంకర్‌ ఇన్వెస్టర్లకు 1,06,61,418 షేర్లను కంపెనీ కేటాయించింది. ఒక్కో షేర్‌ను గరిష్ఠ ధరైన రూ.531కు విక్రయించిన ట్లు కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా రూ.566.12 కోట్లు సమీకరించింది.