For Money

Business News

వేరాంద లర్నింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ షేర్‌ ఇవాల స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నష్టాలతో లిస్టయింది. ఈ కంపెనీ షేర్‌ను రూ. 137లకు ఆఫర్‌ చేయగా… నష్టాలతో రూ.125 వద్ద ఎన్‌ఎస్‌ఈలో లిస్టయింది. అక్కడి నుంచి పెరుగుతూ వచ్చి రూ. 131.25కి చేరింది. ఓపెన్‌ ఆఫర్‌ ధరతో పోలిస్తే ఇంకా 4.2 శాతం నష్టంతో ఉన్నా… అమ్మేవారు లేకపోవడంతో… అదే ధర కొనసాగుతోంది. ఈ ధర వద్ద ఎన్‌ఎస్‌ఈలో 30 లక్షల షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు.