వేదాంత్ ఫ్యాషన్స్ లిస్టింగ్ అదుర్స్
వేదాంత్ ఫ్యాషన్స్ కంపెనీ షేర్లు ఆకర్షణీయ లాభాలతో లిస్టయ్యాయి. ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌ను ఈ కంపెనీ రూ.866కి జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ షేర్లు బీఎస్‌ఈలో తొమ్మిది శాతం లాభంతో రూ.936 వద్ద లిస్టయ్యాయి. ఇంట్రా డేలో రూ.993కు చేరినా చివరికి 7.95 శాతం లాభంతో రూ.934.85 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో మాత్రం 8.9 శాతం లాభంతో రూ.943.05 వద్ద ఈ షేర్లు ముగిశాయి. స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ఉండటం ఈ షేర్ లిస్టింగ్ కలిసొచ్చింది.