వేదాంత్ ఫ్యాషన్స్ ఐపీఓ రేపటి నుంచి
మాన్యవర్ వేర్ దుస్తులను విక్రయించే వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ (IPO) రేపు 4 ప్రారంభం కానుంది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ రూ.824-866. ఈ ఆఫర్ ద్వారా రూ. 3149 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. పబ్లిక్ ఆఫర్ కింద 36,364,838 ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. ఒక లాట్లో 17 షేర్లు ఉంటాయి. కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కనీస దరఖాస్తు మొత్తం రూ. 14,722. గరిష్ఠంగా 13 లాట్లకు అంటే 221 షేర్లకు దరఖాస్తు చేయొచ్చు. ఫిబ్రవరి 16న ఈ షేర్ లిస్ట్ అయ్యే అవకాశముంది. సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదికి కంపెనీ రూ. 1,445 కోట్ల టర్నవర్‌పై రూ.98 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఇష్యూపై ప్రారంభంలో ఇన్వెస్టర్లకు ఆసక్తి కనబర్చినా… ఇపుడు క్రమంగా తగ్గుతోంది. గ్రే మార్కెట్లో ఈ ఇష్యూపై ప్రీమియం రూ. 43లకు పడిపోయింది. రూ. 866ల షేర్‌పై ఈ స్థాయి ప్రీమియం అంటే … ఆఫర్‌కు దరఖాస్తు చేయకపోవడం మంచిదని విశ్లేషకులు అంటున్నారు.